Arvind Kejriwal : వ‌ర‌ద బాధితుల‌కు సీఎం భ‌రోసా

స‌హాయ‌క శిబిరాల‌కు త‌రలింపు

Arvind Kejriwal  : ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఉత్త‌ర భార‌త దేశం నుంచి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌ల ఉధృతికి న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. దేశ రాజ‌ధానిలో చాలా చోట్ల నీరు చేరింది. ప్ర‌ధానంగా రాజ్ ఘాట్ తో పాటు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇల్లు కూడా నీళ్ల‌లో ఉండి పోయింది. ఈ త‌రుణంలో ఆదివారం వ‌ర‌ద‌ల‌తో ప్ర‌భావిత‌మైన ఢిల్లీ లోని ప‌లు ప్రాంతాల‌ను స్వ‌యంగా సంద‌ర్శించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

అనంత‌రం సీఎం(Arvind Kejriwal) మీడియాతో మాట్లాడారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల కోసం పాఠ‌శాల‌లో స‌హాయ‌క శిబిరాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. మోరీ గేట్ లోని ఓ పాఠశాల‌లో ఏర్పాటు చేసిన స‌హాయ శిబిరంలో బాధితుల‌తో మాట్లాడాన‌ని చెప్పారు. బాధిత ప్ర‌జ‌ల‌కు వ‌స‌తితో పాటు ఆహారం, నీరు , మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఈ వర‌ద‌ల కార‌ణంగా ముఖ్య‌మైన పేప‌ర్లు, పిల్ల‌ల పుస్త‌కాలు కొట్టుకు పోయాయ‌ని, వారికి ప్ర‌త్యేక శిబిరాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు సీఎం. పిల్ల‌ల‌కు పుస్త‌కాలు, దుస్తులు తిరిగి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఢిల్లీ సీఎం. మ‌రింత‌గా న‌ష్ట పోయిన వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

Also Read : Criminal Cases MP Sons : కేకే కొడుకుల‌పై క్రిమిన‌ల్ కేసు

Leave A Reply

Your Email Id will not be published!