Arvind Kejriwal : ప్రతిపక్షాల ఐక్యత అవసరం – సీఎం
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ
Arvind Kejriwal : కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినన్స్ ను వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). గురువారం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్ తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది కేంద్రంతో. రేపు మిగతా బీజేపీయేతర ప్రభుత్వాలకు కూడా రాదని నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు.
ఇవాళ మోదీ బీజేపీ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేస్తామని బెదరింపులకు ఉరి చేస్తోందంటూ ధ్వజమెత్తారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకున్న అధికారాలు ఎవరికి ఉంటాయనే దానిపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
కేంద్రం నియమించిన ఎల్జీకి ఎలాంటి పవర్స్ ఉండవని స్పష్టం చేసింది. ఒక్క లా అండ్ ఆర్డర్ , భూ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఎల్జీకి ఉంటాయని పేర్కొంది. మిగతా అంశాలన్నీ ఢిల్లీ ప్రభుత్వానికి చెందుతాయని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా శరద్ పవార్ మాట్లాడుతూ ఢిల్లీ సర్కార్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Also Read : Chandrababu Naidu