Arvind Kejriwal : రాజ‌స్థాన్ లో హ‌స్తం క‌మ‌లం స్నేహం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం

Arvind Kejriwal Rajasthan : రాజ‌స్థాన్ లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సోమ‌వారం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Rajasthan) తో పాటు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు.

ప‌వ‌ర్ కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన వ‌సంధుర రాజే , కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్క‌టై పోయార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌న్నారు. వాళ్ల కోసం ప‌నులు చేసుకుంటార‌ని కానీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌మ‌యం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇలా ఎంత కాలం మీరు ఉంటార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఆద‌రించాల‌ని కోరారు. తాము సుర‌క్షిత‌మైన పాల‌న అంద‌జేస్తామ‌ని చెప్పారు. మెరుగైన విద్య‌, ఆరోగ్యం , ఉపాధి క‌ల్పిస్తున్నందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం త‌మ‌ను టార్గెట్ చేసింద‌న్నారు.

విద్యా , ఆరోగ్యం కోసం కృషి చేసిన త‌మ నాయ‌కుడు మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాపై నిరాధార ఆరోప‌ణ‌లు చేసి జైలుకు పంపించింద‌ని ఆరోపించారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అంటే అని ప్ర‌శ్నించారు. దేశంలో బీజేపీ ఒక్క‌టే ఉండాల‌ని అనుకుంటోంద‌ని కానీ ప్ర‌తిప‌క్షాలు లేకుండా వేధింపుల‌కు గురి చేస్తోంద‌న్నారు. కానీ తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

Also Read : జైళ్లంటే మాకు భ‌యం లేదు – రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!