Ashok Gehlot Sonia Gandhi : మేడంను కలవనున్న గెహ్లాట్
ముదిరిన రాజకీయ సంక్షోభం
Ashok Gehlot Sonia Gandhi : రాజస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా కొలిక్కి రాలేదు. 90 మంది ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ కు మద్దతు పలికారు. ఏఐసీసీ పార్టీ చీఫ్ పదవికి సంబంధించి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. 19న ఫలితాలు రానున్నాయి.
ఈ తరుణంలో రాజస్థాన్ సీఎం పదవిపై సచిన్ పైలట్ , అశోక్ గెహ్లాట్ ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. సంక్షోభ నివారణకు పార్టీకి సంబంధించిన సీనియర్లు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే జైపూర్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
మొత్తం ఎమ్మెల్యేలు ప్రస్తుతం గెహ్లాట్ వైపు ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సీఎం కారణమంటూ పరిశీలకులు మేడం సోనియా గాంధీ(Sonia Gandhi)కి నివేదికలు ఇచ్చారు. దీంతో మేడం గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలో బుధవారం పార్టీ చీఫ్ తో సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) భేటీ కానున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తన ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. మరో వైపు ఎప్పుడు ప్రభుత్వం కూలి పోతుందా అని భారతీయ జనతా పార్టీ ఆశగా ఎదురు చూస్తోంది.
ఇక రాహుల్ గాంధీ చేసిన కామెంట్ తో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలన్నది పార్టీ నియమమని, ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేసింది.
దీంతో అశోక్ గెహ్లాట్ పార్టీ చీఫ్ పదవికి బరిలో ఉంటారా లేక సీఎంగా కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ మొత్తం సోనియా గాంధీ కేంద్రంగా సాగుతోంది.
Also Read : ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే