Ashok Gehlot : ప్రజలనే కాదు ఎమ్మెల్యేలను కొంటే ఎలా
బీజేపీపై నిప్పులు చెరిగిన సీఎం అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : భారతీయ జనతా పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరగనున్నాయి. రాజస్థాన్ లోని సబర్ కాంత జిల్లా ఖేద్ బ్రహ్మ పట్టణంలో ఆదివారం బారీ ర్యాలీ చేపట్టారు. గతంలో ప్రజలను కొనుగోలు చేశారు.
ఆ తర్వాత ఓటింగ్ యంత్రాలను మాయ చేశారు. మరోసారి పవర్ లోకి వచ్చారంటూ నిప్పులు చెరిగారు సీఎం. కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాలను కూలదోశారంటూ ధ్వజమెత్తారు. ప్రజలపై ధరాభారం పెద్ద ఎత్తున పడిందని , నిత్యావసర సరుకుల ధరలు మోయలేని స్థితికి చేరుకున్నాయని అన్నారు అశోక్ గెహ్లాట్.
ప్రస్తుతం ప్రజా సమస్యలను పరిష్కరించలేని బీజేపీ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను నేరుగా కొనే పరిస్థితికి దిగజారిందంటూ మండిపడ్డారు. ఈ దేశంలో కొలువు తీరింది బీజేపీ సర్కార్ కాదన్నారు. దీనిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పేర్కొన్నారు.
ఈద్ వేడుకల సందర్భంగా మేకలను కొనుగోలు చేసిన విధంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ బీజేపీపై భగ్గుమన్నారు సీఎం(Ashok Gehlot). అరుణాచల్ ప్రదేశ్ , కర్ణాటక, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ లో ధన బలం ఉపయోగించి ప్రభుత్వాలను కూల్చి వేశారంఊట ఆరోపించారు. రాజస్థాన్ లో కూడా గద్దె దింపేందుకు బీజేపీ విఫయత్నం చేసిందన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి కోసం సిద్దమైనప్పుడు ఏర్పడిన గందరగోళాన్ని ఆసరాగా చేసుకొని పడగొట్టే ప్రయత్నం చేసిందంటూ మండిపడ్డారు.
నవంబర్ 8 నాటికి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వెల్లడించారు.
Also Read : గుజరాత్ లో బ్రిడ్జి కూలి..40 మంది మృతి