Ashok Gehlot : సుప్రీంకోర్టు నిర్ణయం అశోక్ గెహ్లాట్ స్వాగతం
జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు ఓకే
Ashok Gehlot : జాతీయ ఆహార చట్టం ప్రకారం ఆహార ధాన్యాలు దేశంలో చివరి మనిషికి చేరేలా చూడటం కేంద్ర ప్రభుత్వ విధి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ ను ఆదేశించడాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) స్వాగతం పలికారు. శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిని విస్తరించాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు అశోక్ గెహ్లాట్.
ప్రస్తుత జనాభా ప్రాతిపదికన జనాభా ఆహార చట్టం పరిధిని విస్తరించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎవరూ ఖాళీ కడుపుతో నిద్ర పోకూడదనేది మన సంస్కృతి అని డిసెంబర్ 6న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆహార ధాన్యాలు చివరి మనిషికి చేరేలా చూడాలని కోరారు అశోక్ గెహ్లాట్. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ల సమయంలో వలస కార్మికుల దుస్థితికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు స్వయంగా విచారించింది.
కోర్టు విచారణకు సంబంధించిన నివేదికను ట్విట్టర్ లో పంచుకున్నారు అశోక్ గెహ్లాట్. తమ ప్రభుత్వం జాతీయ ఆహార చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు సీఎం(Ashok Gehlot). ప్రస్తుత జనాభా పౌరులందరికీ ఆహారం అందించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎవరూ ఆకలితో నిద్ర పోకూడదనే ఉద్దేశం సంకల్పంతో తాము అందరికీ ఆహారాన్ని అందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 900 మంది ఇందిరా రసోయ్ లు పని చేస్తున్నారని చెప్పారు అశోక్ గెహ్లాట్. ఇక్కడ పూర్తి భోజనం కేవలం రూ. 8 రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు.
Also Read : దేశంలో మనుషులంతా ఒక్కటే – రాహుల్