Bhagwant Mann : విద్వేష రాజకీయాల ఫలితం – మాన్
ప్రధాని మోదీపై సీఎం మండిపాటు
Bhagwant Mann : భారతీయ జనతా పార్టీ కేవలం దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది పీఎం అంటూ స్పష్టం చేశారు.
Bhagwant Mann Asking
పార్లమెంట్ లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అయినా ఒక రాష్ట్రం పూర్తిగా మండి పోతుంటే, అల్లర్లకు, ఆగ్రహావేశాలకు లోనవుతుంటే ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.
ఇదే విషయాన్ని తన సోదరుడు , యూపీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించాడని దీనిని జీర్ణించు కోలేక రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తో మోదీ సర్కార్ సస్పెండ్ చేయించిందంటూ భగవంత్ మాన్(Bhagwant Mann) ఆరోపించారు. మణిపూర్ అగ్ని గోళంలా మడుతోందని దీనికి ప్రధాన కారణం విద్వేష పూరితమైన రాజకీయాల ఫలితం తప్ప మరొకటి కాదన్నారు.
పంజాబ్ సీఎం గురువారం పార్లమెంట్ భవనానికి వచ్చారు. అక్కడ నిరసన తెలియ చేస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు మద్దతు తెలిపారు. నల్ల దుస్తులు ధరించి ఆందోళన బాట పట్టారు ఎంపీలు. వీరికి సంఘీభావం ప్రకటించారు సీఎం.
Also Read : Revanth Reddy : రేపు జీహెచ్ఎంసీ ముట్టడి – టీపీసీసీ