కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 224 సీట్లకు గాను 2,516 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తాయని అంచనా వేయగా మరికొన్ని సంస్థలు హంగ్ ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంది. తమకు 140 సీట్లు తప్పక వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మే 13న శనివారం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భారతీయ జనతా పార్టీ అక్రమంగా పవర్ లోకి వచ్చింది. ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు సీఎం బఘేల్. ప్రజా వ్యతిరేక పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, ఆ విషయం పోలింగ్ రోజే బయట పడిందన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే భారీగా పోలింగ్ నమోదైందని తెలిపారు.
ఆరోజు ఫలితాలు విద్వేష రాజకీయాలను ప్రేరిపిస్తూ లబ్ది పొందాలని అనుకున్న బీజేపీకి తగిన రీతిలో గుణపాఠం తప్పదన్నారు భూపేష్ బఘేల్. యావత్ దేశం మొత్తం కర్ణాటక వైపు చూస్తోందన్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని ఈ ఎఫెక్టు తప్పక పడుతుందన్నారు. కులం పేరుతో, మతం పేరుతో ద్వేషం వెదజల్లుతూ ఉందని జనం కాటు వేయక తప్పదన్నారు బఘేల్.
