Bhupesh Baghel PM Modi : ప్రధానితో భూపేష్ బఘేల్ భేటీ
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆరా
Bhupesh Baghel PM Modi : ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(Bhupesh Baghel PM Modi) శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా చర్చించారు. మోదీతో భేటీ అనంతరం భూపేష్ బఘేల్ మీడియాతో మాట్లాడారు. ఎన్పీఎస్ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు కేంద్రం నిరాకరించింది.
అయినప్పటికీ పాత పెన్షన్ స్కీమ్ కింద వచ్చే ప్రయోజనాలను రాష్ట్ర అధికారులు, ఉద్యోగులకు వర్తింప చేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో సీఎం ప్రధానమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రధానమంత్రితో చర్చించినట్లు చెప్పారు భూపేష్ బఘేల్.
కాగా పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) విషయంలో ఒక రోజు ముందుగానే ఛత్తీస్ గఢ్ మంత్రివర్గ సమావేశం జరిగిందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి మేలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నరేంద్ర మోదీ తన ప్రియమైన తల్లిని పోగొట్టుకున్నారు. ఆయన దుఖః సమయంలో ఉన్నారు.
అందుకే పలుకరిద్దామని వచ్చానని తెలిపారు భూపేష్ బఘేల్. పీఎంతో జరిగిన చర్చల్లో ప్రధానంగా రాష్ట్రంలో నక్సల్స్ సమస్య చర్చకు వచ్చిందని చెప్పారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉపాధి, వ్యవసాయం, తదితర పథకాలు సామాన్యుల జీవితాల్లో ఎలా మార్పులు తీసుకు వస్తున్నాయో వారికి చెప్పానని అన్నారు భూపేష్ బఘేల్.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే డిమాండు పార్టీలో నెలకొనడంపై స్పందించారు ఛత్తీస్ గఢ్ సీఎం.
Also Read : షెహన్’ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ