Bhupesh Baghel : చత్తీస్ గఢ్ సీఎం షాకింగ్ కామెంట్స్
బీజేపీ ఏర్పడక ముందే హిందువులున్నారు
Bhupesh Baghel : చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్(Bhupesh Baghel) షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలు తామే హిందువులకు ప్రతినిధులమని ప్రకటిస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు.
ఆయా సంస్థలు, పార్టీ పుట్టక ముందు భారత దేశంలో హిందువులు ఉన్నారని మరిచి పోకూడదన్నారు. చరిత్ర తెలియని వాళ్లు చరిత్రను తిరగ రాసేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న ఘనత ఆర్ఎస్ఎస్ ది కాదా అని భూపేష్ బఘేల్ ప్రశ్నించారు. అసలు ఎక్కడి నుంచి హిందుత్వ వచ్చిందో చెప్పాలన్నారు.
మీరు ప్రధానంగా ఏ దేవుడుని, ఏ దేవతని, ఏ దేవాలయాలను అనుసరిస్తున్నారని ప్రజలకు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. తమ పార్టీకి 134 ఏళ్లవుతోందని కానీ హిందూత్వ సంస్థలు, పార్టీ 1925 నుంచి వచ్చిందన్నారు.
అంతకు ముందు హిందువులు ఉన్నారన్న విషయం మరిచి పోతే ఎలా నిలదీశారు. తామేదో దేశానికి రక్షకులమైనట్లు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు భూపేష్ బఘేల్(Bhupesh Baghel).
బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం. గూండాగిరితో భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.
దేశంలో ప్రజలను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. ఏదో ఒక రోజు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ విద్వేషంతో ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటోందంటూ ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య ఆరోపించారు. దీనిపై సీఎం మండిపడ్డారు.
Also Read : తమిళ సమస్యపై భారత్ ఆందోళన