CM Bommai : ప్రవీణ్ నెట్టారు హత్య కేసు ఎన్ఐఏకి అప్పగింత
ప్రకటించిన కర్ణాటక సీఎం బొమ్మై
CM Bommai : కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సంచలన ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టారును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు, పార్టీ పరంగా మరో రూ. 25 లక్షలు అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో పూర్తి విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించినట్లు ప్రకటించారు సీఎం బొమ్మై(CM Bommai). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. 24 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా అవసరమైతే యూపీలో యోగి అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడ తీసుకు వస్తామని చెప్పారు.
పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని, ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారని సీఎం చెప్పారు. ప్రవీణ్ నెట్టారు హత్య వెనుక ఏ శక్తులు ఉన్నాయనేది తేల్చేందుకే ఎన్ఐఏకి అప్పగించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా ప్రవీణ్ మర్డర్ జరిగిన తర్వాత మంగళూరులో మరొకరు హత్యకు గురి కావడం కర్ణాటకలో కలకలం రేపింది. మరో వైపు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా వరుస హత్యలతో అట్టుడుకుతోంది కన్నడ రాజ్యం.
Also Read : రాజీ పడం ప్రయాణికుల భద్రత ముఖ్యం