కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 132 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ దిశగా పరుగులు తీస్తోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 60 సీట్లకే పరిమితం కాగా కింగ్ పిన్ గా మారాలని ఆశించిన జనతాదళ్ సెక్యూలర్ పార్టీ కేవలం 22 సీట్లలోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెల్లడి కావడంతో అధికారం దిశగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటి దాకా సీఎంగా కొలువు తీరిన బస్వరాజ్ బొమ్మై శనివారం ఫలితాల సరళిపై మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో తాము పార్టీ సమావేశంలో విశ్లేషించుకుంటామని స్పష్టం చేశారు. తాము పవర్ లోకి వస్తామని అనుకున్నామని కానీ విజయం సాధించడంలో విఫలం కావడం ఒకింత బాధకు గురి చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇవ్వడంలో సక్సెస్ అయ్యిందని ఆరోపించారు. ఇది పూర్తిగా తమ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టిందన్నారు. గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరగడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా బొమ్మై ఎట్టకేలకు తాను విజయం సాధించినా ఇతర చోట్ల పోటీ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటి బాట పట్టారు. ఒక రకంగా చెంప ఛెళ్లుమనిపించేలా తీర్పు చెప్పారు కన్నడ ఓటర్లు.