CM Bommai : అవసరమైతే కన్నడ నాట యోగి మోడల్
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కామెంట్స్
CM Bommai : కర్టాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీకి చెందిన యూత్ వింగ్ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడంతో బీజేపీ శ్రేణులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దీంతో గురువారం కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కర్ణాటకలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు వివిధ పద్దతుల్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఒక వేళ పరిస్థితి అదుపులోకి రాక పోతే కచ్చితంగా యూపీ సీఎం యోగి అమలు చేస్తున్న బుల్డోజర్ మోడల్ ను అమలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు బొమ్మై.
యువ నేతను దారుణంగా వెంబడించి నరికి చంపారు. దీంతో పార్టీలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు సీఎం. బెల్లారేలో ప్రవీణ్ నెట్టార్ హత్య కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే అతివాద ఇస్లామిక్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హత్య పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వం తమను రక్షించ లేక పోయిందంటూ యువ సభ్యులు సామూహిక రాజీనామాలు చేశారు.
కేవలం ఏడాది పూర్తి చేసుకున్న బొమ్మై సర్కార్(CM Bommai) హిందూవుల ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోయిందంటూ బీజేపీ, సంఘ్ పరివార్ మద్దతుదారులు ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంది. జరిగిన దానికి తాము కూడా చింతిస్తున్నామని చెప్పారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూస్తామన్నారు బసవరాజ్ బొమ్మై.
Also Read : పకాలయాపన కోసమేనా పార్లమెంట్ ఉన్నది