CM Bommai : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పీఎస్ఐ స్కామ్ పై స్పందించారు. పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రిక్రూట్ మెంట్ వ్యవహారం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ కుంబకోణానికి సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు.
ఇందులో ప్రమేయం ఉన్న వారందరిపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని చెప్పారు. గురువారం సీఎం బొమ్మై (CM Bommai ) మీడియాతో మాట్లాడారు.
ఈ స్కాంలో తన మంత్రివర్గ సహచరుడు , ఉన్నత విద్యా శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు సీఎం.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్దరామయ్య దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలంటూ డిమాండ్ చేశారు. పీఎస్ఐ స్కామ్ లో ఎలాంటి ప్రమేయం లేదన్నారు.
విచారణ జరుగుతున్న సమయంలో లేని పోని ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు సీఎం బొమ్మై(CM Bommai ). ఇందులో ఈ కేసుకు సంబంధించి ఎవరినీ , ఏ స్థాయిలో ఉన్నా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
మంత్రికి ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు, నిరాధార ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరి కాదన్నారు.
ఈ మధ్య వారికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు సీఎం. కాగా ఈ స్కామ్ కు సంబంధింది ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తాము తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు బసవరాజ్ బొమ్మై.
Also Read : కలకతాలో చిదంబరంకు నిరసన సెగ