CM Conrad Sangma : గవర్నర్ తో సీఎం సంగ్మా భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు విన్నపం
CM Conrad Sangma : మేఘాలయలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే పవర్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ , సీఎం కాన్రాడ్ సంగ్మా మరోసారి అతి పెద్ద పార్టీగా అవతరించారు.
గతంలో ఎన్పీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి. కానీ ఎన్నికలకు ముందు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. తర్వాత సీన్ మారింది. ఊహించని రీతిలో ఈసారి కాంగ్రెస్ , టీఎంసీ చెరో 5 సీట్లు దక్కించుకున్నాయి. మరోసారి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఫాగ్ చౌహాన్ ను కలిశారు.
మొత్తం 60 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో తనకు 32 సభ్యుల మద్దతు ఉందని ఈ సందర్భంగా గవర్నర్ కు వెల్లడించారు. అయితే మద్దతు ఇచ్చే పార్టీలు ఏవనే దానిపై బయటకు చెప్పలేమంటూ దాట వేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా(CM Conrad Sangma). రాజ్ భవన్ కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు సీఎం. తమకు పూర్తి మెజారిటీ ఉందన్నారు. ఎలాంటి ఢోకా లేదన్నారు సీఎం.
బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందని, మరికొందరు తమ సపోర్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు కాన్రాడ్ సంగ్మా. గత నెల ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. వీటిలో ఒకరు చని పోవడంతో దానిని వాయిదా వేసింది ఎన్నికల సంఘం. మొత్తం 59 స్థానాలలో 26 స్థానాలను చేజిక్కించుకుంది సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ.
మరో వైపు కాన్రాడ్ సంగ్మా(CM Conrad Sangma) ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న యుడీపీ 11 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. అందరినీ విస్తు పోయేలా చేసింది. రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందింది.
Also Read : బీజేపీ కంచుకోటలో ఎంవీఏ పాగా