CM Dhami Bus Staff – Rishab Pant : పంత్ ను కాపాడినోళ్ల‌కు స‌న్మానం

జ‌న‌వ‌రి 26న ఘ‌నంగా స‌త్కారం

CM Dhami Bus Staff – Rishab Pant : ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ రాష్ట్రానికి చెందిన క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ను రూర్కీ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాపాడినందుకు గాను హ‌ర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్టు బ‌స్సు డ్రైవ‌ర్ సుశీల్ కుమార్ , కండ‌క్ట‌ర్ల‌ను ఘ‌నంగా స‌త్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఆదివారం పుష్క‌ర్ సింగ్ ధామీ మీడియాతో మాట్లాడారు. బస్సు డ్రైవ‌ర్ , కండ‌క్ట‌ర్ల‌ను(CM Dhami Bus Staff) ఘ‌నంగా స‌న్మానం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఈ మేరకు జ‌న‌వ‌రి 26న జ‌రిగే గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా వారిని స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు ఉత్త‌రాఖండ్ సీఎం.

ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 30న త‌న పేరెంట్స్ ను క‌లిసేందుకని రిష‌బ్ పంత్ ఢిల్లీ నుంచి కారులో బ‌య‌లుదేరాడు. అనుకోకుండా త‌న కారు డివైడ‌ర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో మంట‌లు చెల‌రేగాయి. ఇదే స‌మ‌యంలో ర‌హ‌దారిపై బ‌స్సుతో వస్తున్న డ్రైవ‌ర్ సుశీల్ కుమార్ నిలిపాడు. వెంట‌నే త‌మ వ‌ద్ద ఉన్న దుప్ప‌టిని క‌ప్పాడు.

కారు లోంచి క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ను బ‌య‌ట‌కు తీశారు కండ‌క్ట‌ర్ సాయంతో. ఆ వెంట‌నే అంబులెన్స్ కు ఫోన్ చేయ‌డంతో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు పంత్ . అక్క‌డి నుంచి రూర్కీలో చూపించారు. మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా మాన‌వ‌త్వం చాటుకున్న బ‌స్సు డ్రైవ‌ర్ , కండ‌క్ట‌ర్ల‌కు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.

ఇప్ప‌టికే బ‌స్సు డ్రైవ‌ర్ , కండ‌క్ట‌ర్ల‌కు తాము స‌మాచారం కూడా అందించామ‌ని, వారికి ఏం కావాల‌న్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ధామి.

Also Read : రోడ్డు ప్ర‌మాదం ‘పంత్’ ఆట‌కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!