CM DY CM Amit Shah : అమిత్ షాతో షిండే..ఫడ్నవీస్ భేటీ
ట్రబుల్ షూటర్ తో కీలక చర్చలు
CM DY CM Amit Shah : మహారాష్ట్రలో కొత్తగా కొలువు తీరిన సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను మర్యాద పూర్వకంగా కలిశారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి.
ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను ఏక్ కలవనున్నారు. తనను కలిసిన షిండే, ఫడ్నవీస్ లను ప్రత్యేకంగా అభినందించారు కేంద్ర మంత్రి అమిత్ షా(CM DY CM Amit Shah).
నరేంద్ర మోదీ నాయకత్వంలో మీరిద్దరూ కలిసి మరాఠా ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అంతే కాకుండా భారత దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు అమిత్ షా.
తనను కలిసిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయాన్ని అమిత్ షా తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు ఏక్ నాథ్ షిండే.
దీంతో కొత్తగా షిండే, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రస్తుతం కొత్తగా కొలువు తీరింది. ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేశారు. ఇంకా క్యాబినెట్ ను ఏర్పాటు చేయలేదు.
ఇదిలా ఉండగా బయటకు భేటీ అని చెబుతున్నా కేబినెట్ కూర్పులో ఎవరు ఉండాలనే దానిపై అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.
Also Read : దేశ ఆర్థిక రంగానికి మరాఠా చోదక శక్తి