Eknath Shinde : అంగుళం భూమిని వదులుకోం – షిండే
కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైకి వార్నింగ్
Eknath Shinde : మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మహారాష్ట్రలోని కర్ణాటక పక్కనే ఉన్న గ్రామాలలో నీటి ఎద్దడి నెలకొందని వాటిని తాము ఆధీనంలోకి తీసుకునేందుకు తీర్మానం చేశారు.
ఇప్పటికే మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ నిప్పులు చెరిగారు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో సీఎం ఏక్ నాథ్ షిండే నిద్ర పోతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. దీంతో కర్ణాటక తీర్మానం చేయడంపై తీవ్రంగా తప్పు పట్టారు మరాఠా సీఎం.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తమ భూమికి సంబంధించి ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఏక్ నాథ్ షిండే. కాలు పెట్టినా ఊరుకోబోమని అన్నారు. ఒక్క అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు సీఎం.
మీడియాతో మాట్లాడారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) . సరిహద్దు ప్రాంతంలోని మరాఠీలకు న్యాయం చేస్తామన్నారు. 40 గ్రామాల సమస్యలను పరిష్కరించడం తమ ముందున్న ప్రధాన బాధ్యత అన్నారు. ఈ విషయంపై తాము కేంద్రంతో కూడా మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం.
తమ ప్రాంతం జోలికి వస్తే ఊరుకోబోమని మండిపడ్డారు ఏక్ నాథ్ షిండే. ఇందుకు సంబంధించి సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మరాఠాలో కర్ణాటక, మరాఠా వివాదంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
Also Read : బస్వరాజ్ బొమ్మైపై భగ్గుమన్న ఉద్దవ్ ఠాక్రే