CM Hemant Soren : మోదీపై యుద్దానికి రెడీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్

CM Hemant Soren : ఇండియా కూట‌మి ప్ర‌ధాన ల‌క్ష్యం ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. ఆయ‌న ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూట‌మి కీల‌క స‌మావేశం ఇవాళ ముంబైలో జ‌రిగింది. ఈ మీటింగ్ కు దేశంలోని ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన నేత‌లు హాజ‌ర‌య్యారు.

CM Hemant Soren Said

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లి కార్జ‌జుజ‌న్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ , మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరేన్(CM Hemant Soren) కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై రాజ‌కీయ పార్టీలు ఓ క‌న్నేసి ఉంచాయ‌న్నారు. ప్ర‌జాస్వామ్యం , రాజ్యాంగం ప‌ట్ల త‌మ అభిప్రాయాల‌కు సంబంధించి ఇక్క‌డ చ‌ర్చ‌కు దిగ‌డం దీని ఫలిత‌మే పేర్కొన్నారు హేమంత్ సోరేన్.

దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అన్ని రాజకీయ పార్టీలు ఓ కన్నేసి ఉంచాయ‌న్నారు జార్ఖండ్ సీఎం.

Also Read : Bhagwant Mann : ఇండియా బ‌ల‌మైన కూట‌మి

Leave A Reply

Your Email Id will not be published!