Hemant Soren : మోదీ పాలనపై యుద్దం – హేమంత్ సోరేన్
విపక్షాల కూటమికి ఢోకా లేదన్న సీఎం
Hemant Soren : మోదీ బీజేపీ పాలనపై నిరంతరం యుద్దం చేయాల్సిన అవసరం ఉందన్నారు జేఎంఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్(Hemanth Soren). మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగిన విపక్షాల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా దేశంలో అరాచకత్వం రాజ్యం ఏలుతోందన్నారు.
కేవలం దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలని మోదీ , అమిత్ షా భావిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. దీనిని ఏ ఒక్కరు ఒప్పుకోరని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారంటూ ఆరోపించారు.
Hemant Soren Said
దీనిని తాము గుర్తించామని, ప్రజాస్వామ్యంలో విపక్షాలు తప్పక ఉండి తీరాలన్నారు. అలాకాక పోతే అసలు డెమోక్రసీకి గుర్తింపు అన్నది ఉండదన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా కొత్త రకపు ఆందోళనలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
ఇవాళ ప్రతిపక్షాలు ఎదగనీయకుండా, బలపడకుండా ఎప్పటికప్పుడు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ కేంద్రాన్ని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో బీజేపీకి చూపిస్తామని హెచ్చరించారు.
Also Read : Dipankar Slams : సంక్షోభంలో రాజ్యాంగం – దీపాంకర్