CM Hemant Soren : కేజ్రీవాల్ కు సీఎం సోరేన్ మద్దతు
కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు
CM Hemant Soren : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. శుక్రవారం మర్యాద పూర్వకంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్(CM Hemant Soren) ను కలుసుకున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు ఎంపీలు సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దా ఉన్నారు. ఈ సందర్భంగా గంటకు పైగా సమావేశం అయ్యారు.
ఢిల్లీ పోస్టింగ్ ఆర్డర్ ను వ్యతిరేకించడంలో హేమంత్ సోరేన్ పార్టీ ఆప్ కి మద్దతు ఇస్తుందన్నారు. వచ్చే సెషన్ లో చట్టంగా ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్న పార్లమెంట్ లో ఆర్డినెన్స్ ను సమిష్టిగా ఓడించాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో పరిపాలనా సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఆప్ మద్దతు ఇస్తున్నట్లు జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సెషన్ లో చట్టంగా ఓటింగ్ కు వచ్చే అవకాశం ఉన్న ఈ ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో సమిష్టిగా ఓడించాలని ఇద్దరు సీఎంలు ఉమ్మడి నిర్ణయం ప్రకటించారు.
ఇదిలా ఉండగా ప్రజా స్వామ్యంపై కేంద్రం దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడంలో జేఎంఎం ఆప్ కి మద్దతు ఇస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పట్టించు కోలేదని ఆరోపించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read : 1983 Kapil Team Urges