Jagan Adani : ఇంధన రంగంలో పెట్టుబడుల వెల్లువ
సీఎం జగన్, గౌతమ్ అదానీ సమక్షంలో ఎంఓయూ
Jagan Adani : ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనంపై ఇప్పటికే సీఎం జగన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆ మేరకు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఆయన పాల్గొన్నారు.
ఇప్పటికే పలు సంస్థల అధినేతలతో సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు , తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెండు మోగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.
ఈ రెండు మెగా ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా చేపట్టనుంది అదానీ గ్రూప్.
ఒక రకంగా చెప్పాలంటే ఏపీ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఇదో మైలురాయిగా పేర్కొనవచ్చు. రూ. 60 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని ఎంఓయూలో తెలిపారు.
వీటి ఏర్పాటు వల్ల 10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Adani) బీజీ బీజీగా గడిపారు.
మొదటి రోజు భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Jagan Adani) తో సమావేశం అయ్యారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, అధిపతులతో సీఎం సమావేశమయ్యారు.
ఇక రెండో రోజు విస్తృత చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు అదానీ, జగన్ రెడ్డి. ప్రభుత్వం తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవాన్ , అదానీ కంపెనీ తరపున ఆశిష్ రాజ్ వంశీ సంతకాలు చేశారు.
Also Read : దిగ్గజాలతో జగన్ ములాఖాత్