YS Jagan : ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర సిద్దమైంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇస్కాన్ పిల్లల కోసం నాణ్యవంతమైన భోజనం వడ్డిస్తోంది.
తాజాగా గుంటూరు జిల్లా ఆత్మకూర్ వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50 వేల మందికి భోజనం అందించే వంటశాలను నిర్మించారు.
దీనిని ఏపీ సీఎం సందింటి జగన్ రెడ్డి(YS Jagan) బటన్ నొక్కి స్టార్ట్ చేశారు. హరే కృష్ణ హరే రామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస్ , ఏపీ, తెలంగాణ చీఫ్ సత్య గౌరి చందన దాస్ ఈ కేంద్రీకృత వంట శాల పనితీరు గురించి సీఎంకు వివరించారు.
అక్కడున్న విద్యార్థులకు జగన్ రెడ్డి స్వయంగా వడ్డించారు. తయారైన ఆహారం వేడిగా ఉండేలా తయారు చేశారు. నాణ్యత దెబ్బ తినకుండా వేగంగా పాఠశాలలకు అందించేందుకు ప్రత్యకంగా రూపొందించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం.
అంతే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద హరే కృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు జగన్ భూమి పూజ చేశారు. ఆరున్నర ఎకరాలలో రూ. 70 కోట్ల ఖర్చుతో గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్ పో, సంస్కార్ హాల్ , కృష్ణ లీలాస్ , గోశాల, అన్నదానం హాల్ , యోగా, ధ్యాన మందిరాలు, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం, యువత కోసం ట్రైనింగ్ సెంటర్ నిర్మించనున్నారు.
సీఎంకు ఇస్కాన్ నిర్వాహకులు ఆధ్యాత్మిక గ్రంథాలను అందజేశారు.
Also Read : ఈ జన్మలో బాబు సీఎం కాలేడు