CM KCR : 15న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
ముహూర్తం ఖరారు చేసిన సీఎం
CM KCR : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 15న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారని తెలిపింది. విద్యా, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
CM KCR will Open Medical Colleges
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాలలో దూసుకు పోతోంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు భారీ ఎత్తున ఖర్చు చేసి వీటిని నిర్మించారు.
ఇప్పటి వరకు కేసీఆర్(CM KCR ) 15 మెడికల్ నూతన కాలేజీలను ప్రారంభించారు. తాజాగా మరో తొమ్మిది వైద్య కళాశాలలను స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వీటిని ప్రారంభించినట్లయితే మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 26 మెడికల్ కాలేజీలు అందుబాటుకో వస్తాయన్నమాట.
ఇక తెలంగాణ ఏర్పాటు కాక ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 850 సీట్లు మాత్రమే ఉండేవి. కానీ బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడి 9 ఏళ్ల కాలంలో ఏకంగా ఆ సీట్ల సంఖ్య 3,915కు చేరుకుంది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చదువుకుంటున్న అభ్యర్థులకు మేలు చేకూరనుంది.
Also Read : BJP Tickets : బీజేపీలో పోటా పోటీగా దరఖాస్తులు