President Murmu KCR : ద్రౌపది ముర్ముకు గ్రాండ్ వెల్ కమ్
స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ , గవర్నర్
President Murmu KCR : రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. వీరితో పాటు కేంద్ర మంత్రి గంగాపురం కిషాన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ కూడా వెల్ కమ్ తెలిపారు.
అల్లూరి సీతారామ రాజు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడికి విచ్చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu). కేవలం 27 ఏళ్ల పాటు మాత్రమే జీవించారు సీతారామ రాజు. ఏపీలో పుట్టిన ఆయన ఆనాటి ఆంగ్లేయులను ఎదిరించారు. అడవి బిడ్డల రక్షణ కోసం నిలబడ్డాడు. వారిని చైతన్యవంతం చేశాడు. పోలీస్ స్టేషన్లపై దాడికి దిగాడు.
ఆంగ్గేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. చివరకు బ్రిటిషర్లకు లొంగి పోయాడు. తమను ముప్పు తిప్పలు పెట్టిన శ్రీ అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డ. ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. పాలనా పరంగా తనదైన ముద్ర కనబర్చారు.
Also Read : Merugu Nagarjuna : సామాన్యుడిలాగా ఏపీ మంత్రి జర్నీ
