CM KCR : సింగరేణి కార్మికులకు ఖుష్ కబర్
రూ. 2,184 కోట్ల లాభాల్లో వారికి వాటా
CM KCR : సింగరేణి దేశానికే తలమానికంగా నిలిచింది. ఈ సందర్బంగా కంపెనీకి సంబంధించి వచ్చిన లాభాల్లో కార్మికులు, ఉద్యోగులకు వాటా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. రూ. 2,184 కోట్ల ఆదాయంలో వాటా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇక సమైక్య పాలనలో సింగరేణి ఆగమైంది. కానీ స్వరాష్ట్రం తెలంగాణ వచ్చినంక లాభాల బాట పట్టింది. సీఎండీ శ్రీధర్ హయాంలో సింగరేణి మరింత వెలుగులు చిమ్మడం ప్రారంభించింది. సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది.
గత ఏడాది వచ్చిన లాభాల్లో 30 శాతం వాటా ఉద్యోగులు, కార్మికులకు దక్కనుంది. ఇక్కడ పర్యటించిన సందర్భంగా కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మొత్తం వచ్చిన ఆదాయంలో దాదాపు వాటాగా రూ. 700 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మొత్తం కానుకలు దసరా పండుగ సందర్భంగా అందుకుంటారని వెల్లడించారు. ప్రస్తుతం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ కొనసాగుతోంది. తొమ్మిదేళ్ల కాలంలో బోనస్ అందుకుంటూ వస్తున్నారు సింగరేణి కార్మికులు.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనతో వేలాది మంది సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం దక్కనుంది. ఒక్కొక్కరికీ రమారమి కనీసం లక్షన్నర నుండి రూ. 2 లక్షల దాకా అందుకోనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండ గడుతూనే సింగరేణికి భరోసా ఇచ్చింది రాష్ట్ర సర్కార్.
Also Read : Priyank Kharge : కండక్టర్ గా మారిన మంత్రి ఖర్గే