CM KCR Announce : భారీ వర్షం సెలవుకు ఆదేశం
అన్ని విద్యా సంస్థలకు వర్తింపు
CM KCR Announce : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి వర్షాలు . భారీ ఎత్తున నీళ్లు చేరుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు, జలాశాయలు ప్రమాదకర స్థాయిని దాటికి చేరుకున్నాయి. ఓ వైపు భద్రాచంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎప్పుడు వరద ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు గోదావరి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లింది.
CM KCR Announce Holidays
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇవాల్టి వరకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ సెలవుపై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితి లేనందు వల్ల ఈనెల 28న శుక్రవారం కూడా సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు(CM KCR Announce). దీంతో ప్రభుత్వ కార్యదర్శి వెంటనే ఆదేశాలు జారీ చేయాలిన ఆదేశించారు. దీంతో రేపు సెలవు కావడంతో, ఎల్లుండి శనివారం మొహర్రం ఉండడంతో అన్ని విద్యా సంస్థలు తిరిగి సోమవారం తెరుచుకుంటాయని స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్.
సీఎం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కేసీఆర్ కు వివరాలు తెలియ చేశారు. ఇప్పటికే ఆయా వరద బాధిత జిల్లాలను పర్యవేక్షించేందుకు గాను స్పెషల్ ఆఫీసర్లను నియమించారు సీఎస్ శాంతి కుమారి. ముంపు ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
Also Read : Telangana CS : వరద బాధిత జిల్లాలకు స్పెషలాఫీసర్స్