CM KCR : సారు సర్ ప్రైజ్..! సీఎం బంపర్ ఆఫర్
ఖాళీగా ఉంటే రూ. 3 లక్షలు ఇస్తం
CM KCR : తెలంగాణలో లేదని బుకాయించినా పక్కా టీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్(CM KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మేరకు ఇప్పటికే సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తానని ప్రకటించారు. పనితీరు మార్చు కోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఒక రకంగా ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆగమేఘాల మీద సచివాలయం పూర్తి కాక పోయినా దానిని కూడా స్టార్ట్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు.
మరో వైపు రైతు బంధు, దళిత బంధు , కేసీఆర్ కిట్, పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తో పాటు త్వరలో మరికొన్ని కొత్త పథకాలు రాబోతున్నాయి. వీటికి పేర్లు పెట్టడంలో నిమగ్నమయ్యారు సలహాదారులు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. విపక్షాలను విస్మయ పర్చడం, ప్రత్యర్థులను బురిడీ కొట్టించడం సారుకు వెన్నతో పెట్టిన విద్య.
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం ఖుష్ కబర్ చెప్పారు. ఎవరైనా జిల్లాలో లేదా తెలంగాణలో ఖాళీగా ఉంటే రూ. 3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇండ్లు రాని వాళ్లకు, లేని వాళ్లకు ఇది వర్తిస్తుందని తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్(CM KCR).
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 2 లక్షలు ఖాళీగా ఉండగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మరో వైపు హైకోర్టులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంపై ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
Also Read : మల్లారెడ్డి టైగర్ నిరంజన్ రెడ్డి ఫైటర్