CM KCR Announce : జూలై 31న తెలంగాణ కేబినెట్ భేటీ
ప్రకటించిన సీఎం కేసీఆర్
CM KCR Announce : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 31న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం(CM KCR Announce) నిర్ణయించారు. ఇందులో భాగంగా 40 నుంచి 50 అంశాల మీద కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కూడా మంత్రివర్గం సమీక్షించే ఛాన్స్ ఉంది.
CM KCR Announce Meeting Date
తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీఎం అలర్ట్ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు ఆయా వరద బాధిత జిల్లాలకు సీఎం ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారి పర్యవేక్షణలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మరో వైపు వరదల్లో చిక్కుకున్న బాధితులను, కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ , అగ్ని మాపక సిబ్బందితో పాటు రాష్ట్రానికి చెందిన పోలీసులు ఆదుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ తో పాటు సీఎం కేసీఆర్ అభినందించారు.
Also Read : Sanju Samson : బెంచ్ కే పరిమితమైన శాంసన్