CM KCR : ఏడుగురు సిట్టింగ్ ల‌కు నో ఛాన్స్

బిగ్ షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్

CM KCR : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి తొలి జాబితాను ప్ర‌క‌టించారు. 115 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు తిరిగి ఛాన్స్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో నాలుగు స్థానాల్లో ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంద‌న్నారు కేసీఆర్. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 16న బీఆర్ఎస్ గ‌ర్జ‌న నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

CM KCR First List Announced

ఇదిలా ఉండ‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప్ర‌క‌టించిన జాబితాలో ఏడుగురు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు రిక్త హ‌స్తం చూపించారు కేసీఆర్(KCR). స్టేష‌న్ ఘ‌న్ పూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజ‌య్య కు షాక్ ఇచ్చారు. ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రికి కేటాయించారు.

ఖానాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయ‌క్ ను ప‌క్క‌న పెట్టారు కేసీఆర్. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కేసు ఉండ‌డం వ‌ల్ల ఎమ్మెల్యేగా ఉన్న చెన్న‌మ‌నేని ర‌మేష్ కు ఇవ్వ‌లేద‌న్నారు. దానిపై తీర్పు వ‌చ్చిన త‌ర్వాత ఆలోచిస్తామ‌న్నారు. ఇక త‌న‌ను కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌న‌ను నిల‌బడాల‌ని కోరార‌ని అందుకే తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. గంప గోవ‌ర్ద‌న్ ను ప‌క్క‌న పెట్టామ‌న్నారు. బోథ్ నుంచి బాపు రావు రాథోడ్ , ఉప్ప‌ల్ నుంచి నేతి సుభాష్ రెడ్డి, వైరా నుంచి రాములు నాయ‌క్ ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు సీఎం.

Also Read : KCR Announces List : బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

Leave A Reply

Your Email Id will not be published!