CM KCR Announces : సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

పోచ‌మ్మ గుడి..మసీదు..చ‌ర్చి ప్రారంభం

CM KCR Announces : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. స‌ర్వ మ‌త స‌మాన‌త్వాన్ని కొన‌సాగిస్తూ రాజ్యాంగం అందించిన లౌకిక ఆద స్పూర్తిని ప్ర‌తిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గంగా జ‌మునా తెహ‌జీబ్ ను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటే దిశ‌గా ఖుష్ క‌బ‌ర్ చెప్పారు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న న‌ల్ల పోచమ్మ ఆల‌యం, మ‌సీదు, చర్చీల‌ను ఒకే రోజున ప్రారంభించాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఈమేర‌కు ఆయా మ‌త పెద్ద‌ల‌ను సంప్ర‌దించి అంద‌రికీ ఆమోద యోగ్య‌మైన తేదీని ఖ‌రారు చేశారు.

ఆగ‌స్టు 25వ తేదీన హిందూ సాంప్ర‌దాయాల‌ను అనుస‌రించి పూజారుల స‌మ‌క్షంలో న‌ల్ల పోచ‌మ్మ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న చేసి..గుడిని పునః ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్(CM KCR). అదే రోజున ఇస్లాం, క్రిష్టియ‌న్ మ‌తాల సాంప్ర‌దాయాల‌ను అనుస‌రించి ఆయా మ‌త పెద్ద‌ల ఆధ్వ‌ర్యంలో మ‌సీదును, చ‌ర్చీని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియ‌న్ మ‌తాల పెద్ద‌లతో సంప్ర‌దించారు. ఒకే రోజున మూడు మ‌తాలకు చెందిన ప్రార్థ‌నా మందిరాల‌ను ప్రారంభించే చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం.

Also Read : Pawan Kalyan : జ‌గ‌న్ జ‌ల‌గ లాంటోడు – ప‌వ‌న్

 

Leave A Reply

Your Email Id will not be published!