Thota Chandrasekhar : బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
ప్రకటించిన బీఆర్ఎస్ జాతీయ చీఫ్ కేసీఆర్
Thota Chandrasekhar : భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ ప్రగతి భవన్ లో ఏపీకి చెందిన మాజీ మంత్రి , రిటైర్డ్ ఉన్నతాధికారులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా సీఎం తోట చంద్రశేఖర్ కు ఊహించని పోస్ట్ కట్టబెట్టారు.
ఆయనను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారత జాతీయ సమితి పార్టీకి అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా రావెల కిశోర్ బాబుకు అపారమైన అనుభవం ఉందని, ఆయనను జాతీయ స్థాయిలో ఉపయోగించు కుంటామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
ఇక పార్థసారథి సేవలు కూడా వినియోగించు కుంటామని వెల్లడించారు సీఎం. ఇవాళ తనకు అత్యంత ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా వజ్రాల్లాంటి మనుషులు తనకు పార్టీ పరంగా దొరికారని కొనియాడారు. ఇవాళ శుభదినం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి.
అందరూ మంచి జరగాలని కోరుకుంటారు. దేవుళ్లను ప్రార్థిస్తారు. ఇవాళ ఎందరో నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు వచ్చారని, ఇంకా పలు రాష్ట్రాల నుంచి వచ్చి చేరుతామని అంటున్నారని తెలిపారు కేసీఆర్. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) పట్ల తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. ఆయన సారథ్యంలో పార్టీ ముందుకు వెళుతుందన్నారు. వారు తప్పక విజయం సాధించడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్.
Also Read : బీఆర్ఎస్ పై పేర్ని నాని కామెంట్స్