CM KCR : కుంభంకు కేసీఆర్ భరోసా
మాట ఇస్తే తప్పనన్న సీఎం
CM KCR : నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జిల్లాలో పట్టు కలిగిన నాయకుడిగా పేరు పొందిన యాదాద్రి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్(KCR) మాట్లాడారు.
CM KCR Words
పైళ్ల శేఖర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి పని చేస్తే కాంగ్రెస్ ను ఖతం చేయొచ్చన్నారు. తనను నమ్మి పార్టీలో చేరినందుకు కుంభం ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తాను మాటిస్తున్నానని ఆయనకు మంచి ఛాన్స్ త్వరలో ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే విననని అన్నారు కేసీఆర్.
గతంలో పీవీ కూతురుకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చానని, తనను నమ్ముకున్న వారికి , వచ్చే వారికి అన్యాయం జరగదన్నారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి చోటా గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
భవిష్యత్తు బాగుంటుందని , ఏది ఏమైనా కుంభం చేరడం వల్ల బీఆర్ఎస్ కు అదనపు బలం చేకూరినట్లయిందని ప్రశంసించారు సీఎం.
Also Read : Heavy Rains IMD : భారీ వర్షం జర భద్రం