CM KCR Assurance : సాయ‌న్న కుటుంబానికి సీఎం భ‌రోసా

ఆదుకుంటాన‌ని చెప్పిన కేసీఆర్

CM KCR Assurance : హైద‌రాబాద్ లోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు ప‌ని చేయ‌డంతో వివిధ స్థాయిలలో ఉన్న‌త‌మైన ప‌ద‌వులు చేప‌ట్టిన సాయ‌న్న ఇటీవ‌ల మృతి చెందారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న మృతికి సంతాపం వ్య‌క్తం చేసింది. ఘ‌నంగా నివాళులు అర్పించింది. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా స్నేహితుడ‌ని, వివాద ర‌హితుడ‌ని ప్ర‌శంసించారు స‌భ‌లో సీఎం కేసీఆర్. ఆయ‌న కుటుంబానికి తాను అండ‌గా ఉంటాన‌ని స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు.

CM KCR Assurance Words

సాయ‌న్న ప్ర‌జ‌ల మ‌నిషిగా నిలిచి పోయార‌ని ప్ర‌శంసలు కురిపించారు. ఇదిలా ఉండ‌గా సాయ‌న్న‌కు నివాళి అర్పిస్తూ అసెంబ్లీ సంతాపం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో శాస‌న‌స‌భ ఛాంబ‌ర్ లో సీఎం కేసీఆర్(KCR) ను క‌లుసుకున్నారు మ‌ర్యాద పూర్వ‌కంగా సాయ‌న్న కూతుళ్లు లాస్య నందిత‌, నివేదిత‌. ఈ సంద‌ర్బంగా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేసీఆర్.

ఎప్పుడు ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌ను క‌ల‌వాల‌ని, తాను ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నాన‌ని భ‌రోసా ఇచ్చారు సీఎం. ఎలాంటి స‌హాయం చేసేందుకైనా సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి ఆదాయం రూ. 4.44 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!