Yadagirigutta : యాదగిరిగుట్ట దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దివ్య గోపురంపై ఉన్న శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు వేద పండితులు, పురోహితులు, పూజారులు ఆశీర్వచనం అందించారు కేసీఆర్ కు. సీఎం పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta)చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక శ్రీ లక్ష్మి నరసింహుని ఆలయ గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రుత్వికులు పాల్గొన్నారు.
అనంతరం ప్రధాన ఆలయ ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉపాలయాల్లోని ప్రతిష్టామూర్తులకు మహా ప్రాణ న్యాసం చేపట్టారు. గర్భాలయంలో స్వయంభువుల దర్శనం కేసీఆర్ పూజలతో ప్రారంభమైంది. ప్రథమ ఆరాధన, ఆరగింపు చేపట్టారు.
తీర్థ, ప్రసాద గోష్టి చేపట్టారు. ఇదిలా ఉండగా కేసీఆర్ వెంట మంత్రులు, చైర్మన్లు , ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తిరిగి యాదగిరిగుట్ట (Yadagirigutta)భగవత్ శోభను సంతరించుకుంది.
ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వెల్లి విరుస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహుడి రూపం భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఆలయ పునర్ నిర్మాణం కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1200 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున యాదగిరిగుట్ట ఆలయానికి భక్తులు తరలి వచ్చారు. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాలు కూడా ఉంటాయని వెల్లడించారు ఈవో గీత.
Also Read : యాదగిరిగుట్టలో బ్రేక్ దర్శనం