CM KCR BRS List : గులాబీ ఎమ్మెల్యేలలో గుబులు
బీఆర్ఎస్ తొలి జాబితపై ఉత్కంఠ
CM KCR BRS List : తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన గులాబీ ఎమ్మెల్యేలలో గుబులు రేగుతోంది. బీఆర్ఎస్(BRS) బాస్ కేసీఆర్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోకుండా చేయాలన్నది సీఎం ఆలోచన. ఆయన మదిలో ఏం ఉందో తెలియదు. ఇప్పటికే పార్టీ కార్యవర్గ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఎవరు గీత దాటినా వేటు తప్పదని హెచ్చరించారు. ప్రత్యేకించి కేసీఆర్ ను ఎదిరించే సాహసం ఎవరూ చేయరు. ఆయనను కాదని వెళ్లిన వారు నామ రూపాలు లేకుండా పోయారు. తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు.
CM KCR BRS List Will Prepare
జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేశారు కేసీఆర్. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సర్వేలు చేయించారు. పలు సంస్థలతో రహస్యంగా నివేదికలు కూడా తెప్పించు కున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు కేసీఆర్. దీంతో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. తమకు సీట్లు ఇస్తాడా ఇవ్వడా ఎవరికి ఇస్తాడు..ఎవరిని పక్కన పెడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇప్పటికే తొలి జాబితా కూడా సిద్దం చేసినట్టు సమాచారం. తొలి విడత లిస్టులో 90 నుంచి 95 సీట్లు , మిగతా మిత్ర పక్షాలు ఎంఐఎం, వామపక్షాలకు 25 సీట్లు కేటాయించనున్నట్లు టాక్. రేపే లిస్టు ప్రకటించనున్నట్లు , అందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు గులాబీ శ్రేణులు తెలిపాయి.
Also Read : Uttam Kumar Reddy : పార్టీ మార్పుపై ఉత్తమ్ క్లారిటీ