CM KCR BRS List : 21న బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్..?
కసరత్తు చేస్తున్న సీఎం
CM KCR BRS List : రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు అన్ని అస్త్రాలను సిద్దం చేస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్(BRS Chief), సీఎం కేసీఆర్. ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు పార్టీ బాస్. ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఎవరి మాటా వినరు. ఇప్పటికే పలుమార్లు డిక్లేర్ చేశారు కేసీఆర్.
CM KCR BRS List Will Be Announce
సిట్టింగ్ లకు చాలా మందికి సీట్లు ఇస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడున్న సర్వేలలో కొంత వ్యతిరేకత వస్తుండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొంది. ఇవాళ లేదంటే రేపో బీఆర్ఎస్ తొలి విడత జాబితా ప్రకటించే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
మొత్తంగా 115 సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. కొన్ని మాత్రమే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు ఉన్నాయి. మిత్రపక్షాలకు కొన్ని సీట్లు వదిలేసి సాధ్యమైనంత మేర 95 సీట్లకు ఖరారు చేయనున్నట్లు టాక్.
ఇక బాస్ కేసీఆర్ వద్ద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టు ఉండడంతో ఆయా నివేదికల ఆధారంగా నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎవరికి ఛాన్స్ దక్కతుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Also Read : Bhagwant Mann : ఆప్ హామీ ఇస్తుంది నెరవేరుస్తుంది