CM KCR : నరసింహా కరుణించు నన్ను రక్షించు
కేజీ 16 తులాల బంగారం విరాళం
CM KCR : సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం యాదరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దివ్య విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం కోసం ఏకంగా కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని కేసీఆర్(CM KCR) మనుమడు హిమాన్షు చేతుల మీదుగా అందజేయడం విశేషం. పూజలు అనంతరం సీఎం ఫ్యామిలీకి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. కుటంబానికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో పూర్ణ కుంభతో ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా సీఎం కుటుంబం యాదగిరిగుట్ట సందర్శనం సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకు ము గుట్టకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. సత్య నారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై ఆరా తీశారు కేసీఆర్(CM KCR).
అనంతరం సీఎంతో పాటు ఆయన సతీమణి శోభ కలిసి రోడ్డు మార్గం ద్వారా గుట్టకు వెళ్లారు. భద్రతా కారణాల రీత్యా హైదరాబాద్ నుంచి గుట్ట దాకా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. దీనిపై భగ్గుమన్నారు సీఎం కేసీఆర్. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
Also Read : దసరా పండుగ కోసం ప్రత్యేక రైళ్లు