CM KCR Modi : బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తా – కేసీఆర్
మొన్న చూసింది కొద్ది సేపే ముందుంది పండగ
CM KCR Modi : భారతీయ జనతా పార్టీ నన్ను తక్కువగా అంచనా వేసింది. కేసీఆర్ ఒకరికి భయపడేటోడు కాదు. అలా అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు సీఎం. నిన్న మొన్న మీరు టీవీల్లో చూస్తున్నది కొంతే..ముందుంది ముసళ్ల పండుగ. ఢిల్లీ పీఠాన్ని కదిలిపోయే విషయం నా వద్ద ఉందన్నారు.
తెలంగాణను కబ్జా చేయాలని అనుకుంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 100 కోట్లకు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కానీ బీజేపీ ఆటలు సాగలేదన్నారు కేసీఆర్. నాతో పెట్టుకుంటే మిగలడం కష్టమన్నారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నా ఉపయోగించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు.
బంగారమైన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఆలోచనలో మోదీ ఉన్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేదని అరాచకం రాజ్యం ఏలుతోందని ధ్వజమెత్తారు. పర్యావరణం కోసం పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.
ఎనిమిది సంవత్సరాల మోదీ పాలనలో ఎనిమిది రాష్ట్రాలను పడగొట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని కానీ వారి ఆటలు తన వద్ద సాగవన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు కేసీఆర్(CM KCR Modi) .
ఢిల్లీ కుర్చీని దించే రోజు తప్పక వస్తుందని అది భారత రాష్ట్ర సమితి నుంచి మొదలవుతుందని అన్నారు. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. దొరికిన దొంగలు జైళ్లల్లో ఉన్నారని వారి మోసం బట్టబయలు కావడంతో తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు.
Also Read : మునుగోడులో గెలుస్తం దేశాన్ని ఏలుతం