CM KCR Focus : ఎమ్మెల్యేల జాబితాపై బాస్ ఫోకస్
ఇవాళ లేదా రేపో ప్రకటించే ఛాన్స్
CM KCR Focus : తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా మారింది. కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీజేపీలో జోష్ నెలకొంది. ఇక సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ దౌడు తీస్తోంది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎందరికి టికెట్లు వస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే కేసీఆర్ పలు సర్వేలు తెప్పించుకున్నారు. పర్ ఫార్మెన్స్ ఆధారంగానే టికెట్లు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
CM KCR Focus on Election
పార్టీ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో ఉన్న వారికి ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్(KCR). కొన్ని చోట్ల వ్యతిరేకత, మరికొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి క్యాడర్ బరిలో నిలిచేందుకు ఆశిస్తుండడం తో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరు ఉంటారనే దానిపై కూడా సీఎం కేసీఆర్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
ఇక తొలి విడత జాబితాలో 80 లేదా 90 మందికి ఛాన్స్ ఉండవచ్చని మిగతా 29 సీట్లను వామపక్షాలు, ఇతర పార్టీలకు ఇవ్వవచ్చని అంచనా. ఇక కేసీఆర్ మదిలో ఏముందో ఆ దేవుడికి తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కేటీఆర్, కవితను ప్రసన్నతం చేసుకునే పనిలో పడ్డారు కొందరు. విచిత్రం ఏమిటంటే కూతురు కల్వకుంట్ల కవిత ముందస్తుగానే షకీల్ ను అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించడం కలకలం రేపుతోంది.
Also Read : Pawan Khera : ట్రావెల్ ఏజెన్సీలకు మోడీ సర్కార్ సపోర్ట్