BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు
గత కొన్ని రోజుల నుంచి ఫోకస్
BRS Manifesto : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ 119 సీట్లకు గాను ముందస్తు గానే 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు.
BRS Manifesto to be Released
ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందస్తుగా తాము పవర్ లోకి వస్తే ఏం చేస్తామనే దానిపై తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
దీంతో బీఆర్ఎస్(BRS) పార్టీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కేసీఆర్ ఉన్నట్టుండి ఈనెల 15న రంగంలోకి నేరుగా దిగనున్నారు. ఈ మేరకు కీలక మీటింగ్ చేపట్టనున్నారు. అభ్యర్థులకు బీ- ఫారంలు ఇస్తారు. అంతే కాకుండా 15,16, 17 తేదీలలో జిల్లాలు, నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.
ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీ పరంగా మేని ఫెస్టోను విడుదల చేయనున్నట్టు టాక్. ఇప్పటికే సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. అందరి కళ్లు మేని ఫెస్టోలో ఏం ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : BRS Meeting : 15న బీఆర్ఎస్ కీలక సమావేశం