CM KCR Good News : పల్లెల ప్రగతిలో కార్యదర్శల పాత్ర భేష్
ప్రశంసలు కురిపించిన సీఎం కేసీఆర్
CM KCR Good News : తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్దిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా గ్రామాలతో పోటీ పడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ పురస్కారాలు పొందడంలో వారి కృషి ఎంతగానో ఉందన్నారు. సాధించిన దానితో సంతృప్తి చెందకుండా మరింత ప్రగతిలో ముందంజలో ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నం చేయాలని సూచించారు కేసీఆర్.
తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ది చెందే దిశగా పంచాయతీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే ఉండాలని సీఎం(CM KCR) ఆకాంక్షించారు. ఈ క్రమంలో తమ నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిర్దేశించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి రెగ్యులరైజ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు.
ఈ నేపథ్యంలో ప్రొబేషన్ (కాలపరిమితి) పూర్తి చేసుకున్న కార్యదర్శుల వివరాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియాను , కమిషనర్ హన్మంతురావు లను ఆదేశించారు సీఎం.
Also Read : Janasena I-PAK : మీ వ్యక్తిగత డేటా ఎంత భద్రం