CM KCR : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లకు ఖుష్ కబర్ చెప్పారు. ప్రత్యేకించి ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు రూ. 100 కోట్లు ఫిట్ నెస్ , పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్.
CM KCR Good News to Auto Drivers
తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫిట్ నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
మానకొండూరులో జరిగిన సభలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో అంతా ఆనందంలో మునిగి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారు. వారు రోజూ వారీగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు కేసీఆర్(CM KCR). విద్యా, ఆరోగ్య పరంగా ప్రయారిటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా హోంగార్డులకు 30 శాతం అదనంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం.
Also Read : Renuka Chowdhury : మాదే అధికారం మాదే రాజ్యం