CM KCR : అర్చకులకు కేసీఆర్ ఖుష్ కబర్
గౌరవ భృతి రూ. 5 వేలకు పెంపు
CM KCR : తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్(CM KCR) గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ మేరకు ఓటు బ్యాంకుగా ఉన్న వారిపై ఫోకస్ పెట్టారు. తాజాగా బ్రాహ్మణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పని చేస్తున్న అర్చకులకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఇప్పటి వరకు కేవలం నెలకు గౌరవ భృతి కింద రూ. 2,500 మాత్రమే ఇచ్చే వారు. కానీ దానిని పెంచుతూ రూ. 5 వేలు ఇస్తామని ప్రకటించారు.
శేర్ లింగంపల్లి పరిధి లోని గోపన్ పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటి దాకా గౌరవ వేతనం 75 ఏళ్ల వయస్సు వరకు ఉండేది. కానీ 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 గుడులకు ధూప దీప నైవేద్య పథకం అమలు అవుతోందని చెప్పారు. మరో 2,795 ఆలయాలకు కూడా ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. దీని వల్ల మొత్తం 6,441 ఆలయాలకు మేలు చేకూరుతుందన్నారు. మరో తీపివార్త చెప్పారు సీఎం. ఇప్పటి దాకా ప్రతి నెలా ధూప దీప నైవేద్యాలకు గాను ప్రతి నెలా రూ. 6 వేలు ఇస్తోంది. దానిని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు కేసీఆర్. బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింప చేస్తామన్నారు.
Also Read : United Wrestling Body