CM KCR : రైతన్నలకు కేసీఆర్ ఖుష్ కబర్
10 రోజుల్లో రైతు బంధు జమ
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కేవలం 10 రోజుల్లోనే రైతులందరికీ రైతు బంధు పథకం కింద నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. మోతె జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించారు. ఆనాడు రైతుల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్లుండేవి కావు. ఎక్కడ చూసినా ఎండి పోయిన పొలాలు. నెర్రలు బారిన చెరువులు, కుంటలు.
కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నేను ఒక్కడినే పోరాడిన. బక్క పల్చనోడు తెలంగాణ ఏం తెస్తడు అన్నరు. కానీ తెచ్చి చూపించిన. చావు నోట్లో తలకాయ పెట్టి మళ్లీ వచ్చిన. ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దిన అని అన్నారు కేసీఆర్(CM KCR). కొందరు పని లేనోళ్లు సొల్లు కబుర్లు చెపుతరు.
గాయి గాయి చేస్తరు. వాళ్ల మాటలు నమ్మకండి. నేను చెప్పింది వినండి. తెలంగాణను బంగారు తెలంగాణ చేసేంత వరకు నేను నిద్ర పోను అన్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ధనవంతులుగా మార్చే పూచీ నాది అని చెప్పారు సీఎం. దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా రైతు బంధు అని ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో మీకందరికి మరో శుభవార్త చెబుతానని ప్రకటించారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాన్నానని పేర్కొన్నారు కేసీఆర్. ఆనాటి కష్టాలు ఇప్పుడు లేవు. ఎకరం కోటి పలుకుతోంది. రైతన్నలు కరోడ్ పతులు అయ్యే అవకాశం ఉందన్నారు.
వరద కాల్వలను రిజర్వాయర్లుగా, జీవనదులుగా మార్చుకున్నామన్నారు. ఇక ప్రపంచంలోనే ఎవరూ కట్టనంత కాళేశ్వరం ను కట్టానని అన్నారు సీఎం.
Also Read : తెలంగాణ వైద్య విద్యలో ఖాళీల భర్తీ
పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం : సీఎం కేసీఆర్#RythuBandhu #CMKCR pic.twitter.com/QHysCUBgNO
— Latha (@LathaReddy704) December 7, 2022