Yashwant Sinha KCR : యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి
Yashwant Sinha KCR : యావత్ దేశమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. దేశ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వైపు దేశ ప్రధాన మంత్రితో పాటు ట్రబుల్ షూటర్ అమిత్ షా , కేంద్ర మంత్రులు వస్తున్నారు.
నాలుగు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం. మరో వైపు అంతే ధీటుగా అధికారంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తోంది. దీంతో నగరంలో నువ్వా నేనా అన్న రీతిలో తయారైంది.
బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ బీజేపీ ఎన్డీయే బలపరిచిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వలేదు.
సీఎం కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ఙగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు(Yashwant Sinha KCR) సపోర్ట్ ప్రకటించారు. ఇదే సమయంలో జూన్ 27న యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎంపీలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రావాల్సిందిగా కోరారు కేటీఆర్. ఇందుకు సమ్మతించారు సిన్హా.
శనివారం అందులో భాగంగానే భాగ్యనగరానికి విచ్చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. సాదరంగా ఆహ్వానించారు. తనయుడు కేటీఆర్ ను పరిచయం చేశారు.
నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. 10 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. నగరంలో ఓ వైపు బీజేపీ ఇంకో వైపు గులాబీ జెండాలు రెప రెప లాడుతున్నాయి.
Also Read : ముందస్తు వ్యూహం బీజేపీ సిద్ధం