CM KCR : కేసీఆర్ కు తప్పిన ప్రమాదం
అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండింగ్
CM KCR : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పలు సభలలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం క్యాంపెయిన్ కు ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రమాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
CM KCR Averted Danger
సీఎం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి పాలమూరు జిల్లా దేవరకద్రలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు బయలు దేరారు. కాగా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే దీనిని గుర్తించారు పైలెట్. వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గండం గడిచిందని భావించారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు సీఎం. మరో వైపు ఎన్నికల సంఘం తీవ్రమైన రూల్స్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎదురు గాలి వీస్తోంది.
మరో వైపు హస్తం హవా కొనసాగుతోంది. ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. సర్వేలన్నీ గంప గుత్తగా కేసీఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా గ్రామాలలో పూర్తిగా అందుకు వ్యతిరేకత ఎదురవుతోంది. సీఎం స్వయంగా ఓడిస్తే మహా అయితే ఫామ్ హౌస్ లో కూర్చుంటామని చెప్పడం విస్తు పోయేలా చేస్తోంది.
Also Read : Komatireddy Venkat Reddy : కేసీఆర్ కు మతి భ్రమించింది