CM KCR : ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన ఛార్జీలకు సంబంధించి సీఎం సంతకం చేశారు. జూలై నెల నుంచే ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
CM KCR Said
ఇందులో భాగంగా 3 నుచి 7వ తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్ కు ఇక నుంచి నెలకు రూ. 1,200 అందుతాయి. 8వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న స్టూడెంట్స్ కు డైట్ ఛార్జీలు రూ. 1,400 కు పెరిగాయి.
ఇక 11వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యూయేషన్ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు డైట్ ఛార్జీల కింద రూ. 1,500 చెల్లిస్తున్నారు. దీనిని రూ. 1,875 కు పెంచారు సీఎంకేసీఆర్(KCR). గిరిజన, ఎస్సీ, బీసీ గురుకులాలు, విద్యా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలలో ఉంటున్న విద్యార్థులు 7 లక్షల 50 వలే మందికి ప్రయోజనం చేకూరనుంది.
పెంచిన డైట్ ఛార్జీల కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ. 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనుంది. అయినా విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
Also Read : CM KCR Raitu Bandhu : ధరణి ఉంటేనే రైతు బంధు – కేసీఆర్
