CM KCR Inaugurate : 25న ముహూర్తం సీఎం ప్రారంభం

ఆల‌యం..చ‌ర్చి..మ‌సీదు స్టార్ట్

CM KCR Inaugurate : ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు సీఎం కేసీఆర్(KCR). ఆయ‌న‌కు న‌మ్మ‌కాలు ఎక్కువ‌. అన్నింటికి మించి భ‌క్తి కూడా ఎక్కువే. ఏ సంక్షేమ ప‌థ‌క‌మైనా , కార్య‌క్ర‌మ‌మైనా ప్రారంభించాలంటే తిథులు, న‌క్షాత్రులు, బ్రాహ్మణోత్త‌ములు, స్వామీజీల‌ను సంప్ర‌దించ‌న‌దిదే ప్రారంభించరు. ఇది ఆయ‌న సీఎంగా కొలువు తీరిన నాటి నుంచి వ‌స్తున్న‌దే. ప్ర‌జ‌లు చూస్తున్న‌దే.

CM KCR Inaugurate New Temple, Mosque, Church

యాగాలు, య‌జ్ఞాలు, పూజ‌లు చేయ‌డంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా పాత స‌చివాల‌యం ప‌నికి రాద‌ని కొత్త గా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఇంద్ర‌భ‌వ‌నం లాంటి స‌చివాల‌య సౌధాన్ని నిర్మించారు. ఇక్క‌డ సీఎం ప‌ర్మిష‌న్ ఇస్తేనే వేరే వాళ్లు , ప్ర‌జా ప్ర‌తినిధులైనా వెళ్లేందుకు అనుమ‌తి ఉండ‌దు. ఒక ర‌కంగా చెప్పాలంటే అన్నీ ప‌క‌డ్బందీగా చేశారు.

ఇక స‌చివాల‌య నిర్మాణ స‌మ‌యంలో ఆవ‌ర‌ణ‌లో ఉన్న చ‌ర్చి, మ‌సీదు, ఆల‌యాన్ని కూల్చి వేశారు. నిర్మాణానికి అడ్డు వ‌స్తున్నాయని. అప్పుడు పెద్ద ఎత్తున హిందూ, క్రిస్టియ‌న్, ముస్లిం వ‌ర్గాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది స‌ర్కార్. తిరిగి అంత‌కంటే అద్భుతంగా పున‌ర్ నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ మేర‌కు మ‌సీదు, ఆల‌యం, చ‌ర్చి పూర్త‌య్యాయి. స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యాయి. వీటిని ఒకే రోజు ప్రారంభించాల‌ని సంక‌ల్పించారు సీఎం. ఈ మేర‌కు ఆగ‌స్టు 25న ముహూర్తం పెట్టారు. ఆరోజు వీటికి మోక్షం ల‌భించ‌నుందన్న మాట‌.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

Leave A Reply

Your Email Id will not be published!