CM KCR : స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాలు ప్రారంభం

ప్రారంభించిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

CM KCR :  దేశ వ్యాప్తంగా స్వాత్రంత్ర వ‌జ్రోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. సోమ‌వారం రాష్ట్రంలో 15 రోజుల పాటు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు శ్రీ‌కారం చుట్టింది తెలంగాణ ప్ర‌భుత్వం.

ఈ ఉత్స‌వాల‌ను సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ లోని హెచ్ఐసీసీ వేదిక‌గా భార‌త జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి ప్రారంభించారు. రాష్ట్ర‌మంత‌టా దేశ భ‌క్తి ప్ర‌తిబింబించేలా ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు సీఎం(CM KCR).

స్వ‌తంత్ర వ‌జ్రోత్స‌వాల స్పూర్తిని చాటేలా క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్స‌వంలో 75 మంది వీణ క‌ళాకారుల‌తో వాయిదా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

జంక్ష‌న్లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను విద్యుత్ దీపాల‌తో అలంకరించారు అద్భుతంగా. గ్రామ‌, మండ‌ల‌, మున్సిప‌ల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్ర‌తిభ క‌లిగిన వారంద‌రినీ గుర్తించి పుర‌స్కారాలు అంద‌జేయ‌నున్నారు.

రాష్ట్రంలోని కోటిన్న‌ర‌కు పైగా ఉన్న కుటుంబాల ఇళ్ల‌పై దేశం గ‌ర్వించేలా భార‌త జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేయాల‌ని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని సంస్థ‌ల‌ను ముంద‌స్తుగా ప‌తాకాలు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

ఈ మేర‌కు ఉన్న‌తాధికారులు ఏర్పాట్లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రిలో జాతీయ భావ‌న పెరిగేలా ఇది దోహ‌దం చేస్తుంద‌న్నారు. జాతీయ ప‌తాకం గౌర‌వాన్ని, ఔన్న‌త్యాన్ని మ‌రింత పెంచేందుకు ఈ వ‌జ్రోత్స‌వాలు స‌హ‌క‌రిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR).

వ‌జ్రోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. వ‌జ్రోత్స‌వాల ప్రాశ‌స్త్యాన్ని, దాని ఔన్న‌త్యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

విద్యార్థుల‌లో భార‌త దేశ స్వాతంత్రం , దాని విశిష్ట‌త‌, చ‌రిత్ర తెలిసేలా చూడాల‌న్నారు. ఇప్ప‌టికే సీఎం స‌మీక్ష చేప‌ట్టి వ‌జ్రోవాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష చేప‌ట్టారు.

Also Read : జేఈఈ మెయిన్ ఫ‌లితాలు వెల్ల‌డి

Leave A Reply

Your Email Id will not be published!